రైతన్నలకు తాగునీరు, సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషలు అన్నారు. శనివారం పలాస మండలం రేగులపాడు వద్ద ఆఫ్షోర్ రిజర్వాయర్ కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత పరంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని తెలిపారు. ఆఫ్షోర్ జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్ట్ కనుక బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు.