పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో బుధవారం సింధూర జలశిరి పథకాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నీటి సౌకర్యం కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. మౌలిక వసతుల కల్పనే టిడిపి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.