పాతపట్నం: కొవ్వొత్తుల ర్యాలీ

69చూసినవారు
పాతపట్నం: కొవ్వొత్తుల ర్యాలీ
అహ్మదాబాదులో విమాన దుర్ఘటన చోటు చేసుకోవడంపై పాతపట్నంలో యువత శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. ఘోర విమాన దుర్ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతులకు సంఘీభావం తెలియజేస్తూ, దుర్ఘటన పట్ల బాధను వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇటువంటి దుర్ఘటనలు ఇకముందు చోటు చేసుకోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్