పలాస మండలం బొడ్డపాడు స్మారక భవనం వద్ద ఆదివారం ప్రజాసంఘాల నాయకులు హైదరాబాద్ వీక్షణం బుక్ స్టాల్ లో ఎడిటర్ వేణుగోపాల్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు దినేష్ మాట్లాడుతూ.. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.