వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్రలో ఓ యువజన సంఘం ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి క్విజ్ పోటీలు శనివారం జరిగాయి. వివిధ పాఠశాలల నుంచి 19 టీమ్స్ పాల్గొన్నాయి. వీరికి తొలుత స్కీనింగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో టాప్ 10 టీమ్కు క్విజ్ పోటీలు చేపట్టారు. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ప్రవీణ్, సంతోష్, ఆదర్శ్, ప్రశాంత్ పాల్గొన్నారు.