మత్స్య సంపద వృద్ధి చెందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించింది. ఈ 61 రోజుల్లో రొయ్యలు, చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయని, ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని జీరుపాలెం, కొవ్వాడ, బుడగట్లపాలెం, డి. మత్స్యలేశం, కొత్త ముక్కాం, బడివానిపేట, పలు తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు తమ తమ ఇంజన్ బోట్లను మంగళవారం ఒడ్డుకు వరుసగా చేర్చుతున్నారు.