రథసప్తమి వేడుకలకు ఎటువంటి ఇబ్బందులుకలగకుండా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలయ పరిసర ప్రాంతాలను రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఆలయ అధికారులతో పరిశీలించారు. భక్తులు వెళ్లే దర్శనం మార్గాలు, బందోబస్తు, క్యూ లైన్లు మళ్లింపు పై అధికారులకు సూచనలు చేశారు.