టెక్కలి మండలం కె.కొత్తూరు జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి లారీ బ్రేక్ ఫెయిల్ అయింది. రోడ్డుపై నిలిచిపోయింది. పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ ప్రమాదానికి గురిఅయింది. సమయానికి వాహనాలు ఏమీ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈమేరకు హైవే పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.