ప్రతి చేనుకు నీరందించే సంకల్పానికి వ్యవసాయ, మత్స్య, పశు సంవర్ధకశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బాసటగా నిలిచారని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. నిమ్మాడలోని మంత్రి కార్యాలయంలో టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా సాగునరందక రైతులు అవస్థలు పడ్డారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే రైతుకు సాగునీరు అందిందన్నారు.