మందసా మండలం బైరి సారంగపురం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రథమ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళిలర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు విద్యాభివృద్ధికి మహిళా ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర వహిస్తారన్నారు. మహిళా ఉపాధ్యాయురాలు కొప్పల పద్మను శాలువాతో సత్కరించారు.