వజ్రపు కొత్తూరు: పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్

61చూసినవారు
వజ్రపు కొత్తూరు: పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్
వజ్రపు కొత్తూరు మండలం అక్కుపల్లి సముద్ర తీర ప్రాంతంలో పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం ముందస్తు సమాచారం అందుకున్న ఎస్సై నిహార్ తమ సిబ్బందితో కలిసి అక్కుపల్లి వద్ద సముద్ర తీరంలో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేశారు. వారి వద్ద నుండి ఐదువేల 60 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 11 మందిని పోలీస్ స్టేషన్కు తరలించి అరెస్టు చేశారు. ఇటువంటి చర్యలపై నిఘా ఉంచామన్నారు.

సంబంధిత పోస్ట్