వజ్రపు కొత్తూరు: శ్రీరామనవమి ఉత్సవాలలో ఎమ్మెల్యే గౌతు శిరీష

76చూసినవారు
వజ్రపు కొత్తూరు: శ్రీరామనవమి ఉత్సవాలలో ఎమ్మెల్యే గౌతు శిరీష
వజ్రపు కొత్తూరు మండలంలోని నువ్వలరేవు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం పాల్గొన్నారు. అంతకుముందు ఆ గ్రామదేవత బృందావతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామ నవమి ఉత్సవాలను నువ్వల రేవు గ్రామంలో ఘనంగా నిర్వహిస్తూంటారని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్