వజ్రపుకొత్తూరు మండలం ఉండ్రుకుడియా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బొచ్చ షణ్ముఖరావును కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య సస్పెండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మండల విద్యాశాఖాధికారి బి. వెంకటరమణ తెలిపారు. విధులకు గైర్హాజరు కావడం, విద్యార్థులకు విద్యా సామర్థ్యం లేకపోవడంపై ఉపాధ్యాయుడు షణ్ముఖరావుపై స్థానికులు రెండు నెలల కిందట అధికారులకు ఫిర్యాదు చేశారు.