కొత్తపేట సముద్ర తీరంలో సూర్య భగవానుడికి పూజలు

76చూసినవారు
కొత్తపేట సముద్ర తీరంలో సూర్య భగవానుడికి పూజలు
వజ్రపుకొత్తూరు మండలం లో ప్రముఖమైన కొత్తపేట బీచ్ కి రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మంగళవారం సముద్ర స్నానానికి భక్తులు పోటెత్తారు. మండల మాజీ అధ్యక్షులు గోవింద పాపారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ హారతులు అర్పించారు. సుమారు మూడు వేల మందికి ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో బైపల్లి నారాయణ, కృష్ణ, మాజీ సర్పంచ్ నారాయణ స్వామి, సత్యం, గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్