మెలియాపుట్టి నుండి పలాస వెళ్లే ప్రధాన రహదారిలో తుముకొండ గ్రామం సమీపంలో ఆకులమ్మ గుడి ప్రాంతంలో ఉన్న అతిపెద్ద మలుపుతో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉన్నాయని సోమవారం పలువురు ద్విచక్ర వాహనదారులు తెలియజేశారు. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నామని తెలిపారు. సూచికలు ఏర్పాటు చేయాలని కోరారు.