పాతపట్నంలో యువత శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అహ్మదాబాదులో జరిగిన విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు మరల జరగకుండా కేంద్ర ప్రభుత్వం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.