మెలియాపుట్టి మండలంలోని తూముకొండ రామచంద్రపురం గ్రామంలో వెలసి ఉన్న ఆకులమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం భక్తులు బారులు తీరారు. ఆంధ్ర ఇలవేల్పుగా ప్రజలు కొలుస్తున్న ఆకులమ్మ తల్లి అమ్మవారి దగ్గర శ్రావణ శుక్రవారం ను పురస్కరించుకొని భక్తుల తాకిడి పెరిగింది. అయితే రోడ్డు కిరువైపులా ఆటోలు బస్సులు పలు వాహనాలతో కిక్కిరిసిపోయింది. చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.