కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా గణపతి ధనుంజయ రావు నియమితులయ్యారు. ఈయన గతంలో ఆముదాలవలస జూనియర్ కళాశాలలో బోటనీ లెక్చరర్ గా విధులు నిర్వహించారు. ఈయన 2003లో డీఎస్సీ ద్వారా స్కూల్ అసిస్టెంట్ గా, 2008లో ఏపీపీఎస్సీ పరీక్షలలో జూనియర్ లెక్చరర్ గా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక కళాశాలలో విధులలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక అధ్యాపకులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.