ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగింది. హిర మండలం గొట్టా బ్యారేజీ నుంచి శనివారం నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. దీంతో నదీతీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎడారిలా కనిపించిన వంశధార నది ఇప్పుడు వరద నీరు చేరడంతో కళకళలాడుతుంది.