హిరమండలం మండలంలోని కూర్మ గ్రామాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సందర్శించారు. ఇటీవల గ్రామంలోని సమావేశ మందిరం దుండగులు అగ్నికి ఆహుతి చేయడంతో సమాచార అందుకున్న ఆయన పరిశీలించేందుకు శనివారం చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక వాసులతో ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నిందితులు ఎవరైనా వారిని పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.