ఎల్ ఎన్ పేట మండలకేంద్రం రోటరీనగర్ లో ఇళ్లలోకి నీరు చేరి అక్కడ నివసిస్తున్న చిన్నమ్మ, కామరాజు, గణపతిరావు కుటుంబాలు రాత్రంతా నీటిలోనే ఉన్నారు. ఆదివారం ఉదయం తగ్గిన వరద నీరు రాత్రిసరికి ఉద్ధృతంగా ప్రవహించడంతో అధికారులు ఏర్పాటు చేసిన గట్టు కొట్టేసింది. దీంతో సోమవారం వరద నీరు రోడ్డుపై నుంచి ఇళ్లల్లోకి ప్రవేశించింది. అధికారుల స్పందించి నీరు రాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు.