కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్టు-1కు చెందిన ఆసుపల్లి రాములు ఇంటి వద్ద నాటుసారాను విక్రయిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ మహమ్మద్ అమీర్ ఆలీ తెలిపారు. నాటుసారా విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం దాడి చేశామని, ఈ దాడిలో ఐదు లీటర్ల నాటుసారా పట్టుకుని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రాములును అరెస్టు చేసి కేసు నమోదు చేశామని, నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.