కొత్తూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి

62చూసినవారు
కొత్తూరు: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి
కొత్తూరులోని మేదరి వీధికి చెందిన అరిక గడ్డయ్య (47) చెరువులో పడి మృతి చెందినట్లు ఫిర్యాదు అందిందని ఎస్సై అమీర్ అలీ తెలిపారు. ఈనెల 13వ తేదీన బహిర్భూమికి అని ఇంటి వద్ద చెప్పి బయటకు వెళ్లిన గడ్డయ్య అప్పటినుండి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం స్థానిక గ్రామస్తులు చెరువులో మృతదేహం పడి ఉండడాన్ని గమనించి అది గడ్డయ్య మృతదేహంగా గుర్తించారు.

సంబంధిత పోస్ట్