ఎల్.ఎన్.పేట: దోమల నియంత్రణ సామూహిక బాధ్యత కావాలి

52చూసినవారు
ఎల్.ఎన్.పేట: దోమల నియంత్రణ సామూహిక బాధ్యత కావాలి
అనేక వ్యాధులను వ్యాపింపజేసే దోమల నియంత్రణ సామూహికంగా చేపట్టాలని ఎల్.ఎన్.పేట మండలం తురకపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వసుధ అన్నారు. మే16 జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కలిగించారు. ఆరోగ్యపరంగా ఎలాంటి అనుమానిత లక్షణాలు ఉన్న వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్