ఎల్.ఎన్.పేట: పలు గ్రామాల్లో కురిసిన వర్షం

73చూసినవారు
ఎల్.ఎన్.పేట: పలు గ్రామాల్లో కురిసిన వర్షం
ఎల్. ఎన్. పేట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడితో తీవ్రత ఎక్కువగా ఉంది. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మేఘాలు అలుముకొని ఒక మోస్తారుగా వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. వంశధార నది తీర గ్రామాల్లో సాగు చేస్తున్న వాణిజ్య పంటలకు ఈ వర్షం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయా గ్రామాలకు చెందిన రైతులు తెలిపారు. వర్షంతో ఇటుకల తయారీదారులు అనేక ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్