వేసవిలో మండలంలోని అన్ని గ్రామాల్లో తాగు నీటికీ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం ఎల్. ఎన్. పేట మండలంలోని పెద్దకోట, రావిచంద్రి, పూశాం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే గోవిందరావు పర్యటించారు. మెగా రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రతి రోజు రెండు పూటలా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఆయనతో పాటు అంపిలి పోలినాయుడు, తేజేశ్వరరావు, తదితరులు ఉన్నారు.