మెలియాపుట్టి మండలం ఎగువ బగడ గ్రామంలో శుక్రవారం టెక్కలి ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దాడుల్లో 900 లీటర్ల బెల్లం ఊటతో పాటు 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ తెలిపారు. దాడుల్లో పాతపట్నం ఎక్సైజ్ ఎస్ఐ శ్రీనివాస్, మెలియాపుట్టి ఎస్ఐ రమేశ్ బాబు ఉన్నారు.