పారిశుద్ధ్య పనులపై కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది దృష్టి సారించాలని మెలియాపుట్టి ఎంపీడీవో పి. నరసింహ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఆయన చాపర సచివాలయాన్ని సందర్శించి సిబ్బందితో సమీక్షించారు. గ్రామాలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయితీ కార్యదర్శి అప్పారావు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.