వేసవికాలంలో మండల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ అన్నారు. శనివారం మెళియాపుట్టి వెలుగు కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎంపీడీవో పీ నరసింహ ప్రసాద్, జడ్పీటీసీ ఎండయ్య తదితరులు పాల్గొన్నారు.