వెనుకబడిన తరగతుల మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణను జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్ నిర్వహిస్తోందని మెళియాపుట్టి ఎంపిడిఒ పి. నరసింహప్రసాద్ పండా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం కింద 18-50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కొరకు సచివాలయాలను సాంప్రదించాలన్నారు.