అణగారిన వర్గాలకు చేయూత అందించిన ఘనత సావిత్రిబాయి పూలే కే దక్కుతుందని రాష్ట్ర ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగి తెలిపారు. శుక్రవారం మెలియాపుట్టి మండలం కేంద్రంలోని స్థానిక ఆదివాసి పరిషత్ కార్యాలయంలో ఘనంగా 194వ సావిత్రిబాయ్ పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఆమె భర్త మహాత్మా జ్యోతిరావు పూలే వద్ద విద్యను అభ్యసించి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా ఖ్యాతి పొందాలని వివరించారు.