మెళియాపుట్టి మండలంలోని బరబొంతులో శుక్రవారం లింగు పురం భారతి అనే మహిళకు నిప్పంటుకొని గాయాల పాలైంది. చలి తీవ్రతకు ఇంట్లో కొద్దిపాటి అగ్గిమంట వేసుకొని కుటుంబసభ్యులంతా నిద్రిస్తుండగా ఆమె పడుకున్న దుస్తులకు నిప్పంటుకొని తీవ్రగాయాలకు గురైంది. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యం పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.