పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుట్టినరోజు వచ్చే నెల ఒకటో తేదీన ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఫ్లెక్సీలు ఉండేవిధంగా తెలుగుదేశం నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెలియాపుట్టి మండలంలో ఆదివారం మాజీ ఎంపీపీ సలాన మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.