మెలియాపుట్టి మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వీధి కుక్కలు శుక్రవారం హడావుడి చేసాయి. దీంతో అధికారుల విధులకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. వీధి కుక్కలు వెచ్చలవిడిగా స్వైర విహారం చేస్తూ ప్రజలకు సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, కుక్కల సంచారం వలన రహదారిపై రోడ్డు ప్రమాదాలు సైతం అధికంగా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కుక్కల సంచారాన్ని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.