ఒరియా మాధ్యమం కొనసాగించాలి

56చూసినవారు
ఒరియా మాధ్యమం కొనసాగించాలి
మెలియాపుట్టి మండలంలోని చాపర జిల్లా పరిషత్ పాఠశాలలో ఒరియా మాధ్యమాన్ని తొలగించడంతో శనివారం పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం దృష్టిసారించి ఒరియా మాధ్యమాన్ని ఎప్పటిలాగే కొనసాగించి, పరీక్షలు సైతం ఒరియాలోనే నిర్వహించాలని తల్లిదండ్రులు ఎంఈఓ దేవేంద్రరావును కోరారు. లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్