పాతపట్నం మండలం సీతారామపల్లి గ్రామానికి చెందిన నీలాపు చందు అనే బాలుడు దీపావళి మరునాడు జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుడిచేతిని కోల్పోవడం జరిగింది. తామర గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే గోవిందరావు అభిమాని జావ్వాది ఈశ్వరరావులు 46,000 రూపాయలను ఎమ్మెల్యే చేతుల మీదుగా బాలుడి తల్లికి అందజేశారు. ఎమ్మెల్యే భాదిత కుటుంబానికి సహాయం చేసిన వారిని అభినందించారు.