తిరుపతి దేవస్థానం గోశాలలో జరిగిన గో మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోశాలలో పాడి పశువులు అనారోగ్య కారణంగా చనిపోతే వాటిపై తప్పుడు ప్రచారం చేయడం తగదు అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.