పాతపట్నం: పట్టు వస్త్రాలతో అమ్మవారి అలంకరణ

73చూసినవారు
పాతపట్నం: పట్టు వస్త్రాలతో అమ్మవారి అలంకరణ
ఉత్కళ ఆంధ్రుల ఆరాధ్య దైవం పాతపట్నంలో కొలువైన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించినట్లు ఆలయ అర్చకులు ఎ. సంతోష్ కుమార్, టి. రాజేష్ కుమార్ తెలిపారు. వైశాఖమాసం శుక్రవారం మూలా నక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసేందుకు పక్కనే ఉన్న ఒడిస్సాతో పాటు శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నట్లు ఆలయ ఈవో వాసుదేవరావు తెలిపారు. పట్టు వస్త్రాలు, పూలమాలలు, వెండి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించమన్నారు.

సంబంధిత పోస్ట్