మే15 నుండి తిరుపతిలో జరుగు ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ కోరారు. మంగళవారం పాతపట్నంలో జాతీయ మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. యువతను మోసం చేస్తున్న పాలకులపై ఉద్యమించడానికి మహాసభలు వేదిక కానున్నాయన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం హామీలు అమలు కాలేదనివిమర్శించారు.