పాతపట్నం: పల్లాను కలిసిన ఎమ్మెల్యే

52చూసినవారు
పాతపట్నం: పల్లాను కలిసిన ఎమ్మెల్యే
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఆయన నివాసంలో సోమవారం పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా తన కుమారుడు గణేశ్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పకుండా వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని పల్లా శ్రీనివాసరావును ఎమ్మెల్యే ఎంజీఆర్ కోరారు.

సంబంధిత పోస్ట్