సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు తమ ఇంటిని దొంగతనం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాతపట్నం సీఐ రామరావు సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ విలువైన వస్తువులను నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలన్నారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.