అమరావతిపై ప్రముఖ పత్రికలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పాతపట్నంలోని మహిళలు మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంతరపు రోడ్డు జంక్షన్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలి చేస్తూ సాక్షి మీడియా కాదని సాక్షి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆ పత్రిక పేపర్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.