పాతపట్నం: రైలు ఢీకొని 10 ఆవులు మృతి

6చూసినవారు
పాతపట్నం: రైలు ఢీకొని 10 ఆవులు మృతి
పాతపట్నం సమీప హరిద్వారం రైల్వే ట్రాక్ వద్ద ఆదివారం దారుణమైన సంఘటన జరిగింది. మేతకు వెళ్లిన సుమారు 10 ఆవులు విశాఖ నుంచి గునుపూర్ వెళ్తున్న రైలు ఢీకొనడంతో మృతిచెందాయి. ఈ ఘటనను చూసిన యజమానులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ప్రమాద సమయంలో ఆవులు ట్రాక్‌పై ఉన్నట్టు భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్