పాతపట్నంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మండలానికి చెందిన 25 ఏళ్ల వెంకటరావు 14 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని శ్రీకాకుళంలోని ఆసుపత్రికి ఆపై పరిస్థితి విషమించడంతో విశాఖకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 11న మృతి చెందగా గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.