పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు శనివారం జరిగింది. 78 రోజులకు రూ. 6, 89,757లు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో టి.వాసుదేవరావు తెలిపారు. ఈ హుండీ లెక్కింపునకు సహాయ కమీషనర్ వారి కార్యాలయం నుంచి పర్యవేక్షణకు జీవిబిఎస్ రవికుమార్ హాజరయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వాసుదేవరావు, అర్చకులు టి. రాజేష్. టి. హరీష్, టి. సతీష్, భక్తులు హాజరయ్యారు.