పాతపట్నం మండలం సీతారాంపల్లి గ్రామ సమీపంలో గల రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం రాత్రి పూరీ నుంచి గుణుపూర్ వెళ్తున్న రైలు కిందపడి చనిపోయి పడి ఉంటాడని తెలిపారు. ఈ కారణంగా కొంత సమయం రైలును ఆపేశారు. ఈ మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.