కోటబొమ్మాళి మండలం పెద్ద హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన దుంపల దాలమ్మ (65) మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. భర్త మరణించిన తర్వాత ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి పెరటి నుంచి చొరబడ్డ దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించి హత్య చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.