వరుస క్రమంలో వరి నాట్లు వేస్తే బహుళ ప్రయోజనాలు

79చూసినవారు
వరుస క్రమంలో వరి నాట్లు వేస్తే బహుళ ప్రయోజనాలు
వరుస క్రమంలో వరినాట్లు వేయడం ద్వారా పంటకు బహుళ ప్రయోజనాలు ఉంటాయని కొత్తూరు వ్యవసాయ సబ్ డివిజన్ ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనీ ఎస్. సూర్యనారాయణ అన్నారు. గూనభద్ర ఆర్ఆర్ కాలనీకి చెందిన రైతు అంపిలి బుచ్చిబాబు పొలంలో వరినారు చిగుళ్లను చింపి వరుస క్రమంలో నాట్లను శుక్రవారం వేయించారు. ఇలా నాటడం వలన దుబ్బుకు గాలీవెలుతురు బాగా తగిలి చీడపీడలు సోకవని, దిగుబడి బాగుంటుం దని రైతులకు అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్