పోలాకి: జీడితోట వేలంపాట వాయిదా

68చూసినవారు
పోలాకి: జీడితోట వేలంపాట వాయిదా
పోలాకి మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలోని జీడి తోట ఫలసాయం పొందేందుకు ఈ నెల 18కి వాయిదా వేసినట్లు ఎంపిడిఒ జి. రవికుమార్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వేలం పాట నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఇందుకు ప్రభుత్వ పాటగా రూ. 1, 96, 600 ప్రకటించారు. ఆ ధరకు పాట పాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో 18కి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్