పోలాకి మండలంలోని పల్లిపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం రాత్రి ఒకరి వద్ద 27 మద్యం బాటిళ్లను, మరొకరి వద్ద 28 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.